పాతబస్తీకి రూ. వెయ్యి కోట్లు
పాతబస్తీకి రూ. వెయ్యి కోట్లు
హైదరాబాద్: అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన హైదరాబాద్ పాతబస్తీలో రూ. వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వరదలు, మురుగునీరు ప్రవ హించని, విద్యుత్ సమస్యలు, మంచినీటి ఎద్ద డి, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంగా పాతబస్తీని తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని అన్నారు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే తాను పాతబస్తీలో పర్యటించి పనులకు శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు. అప్పటికల్లా ప్రణాళిక రూపొందించాలని, అన్ని సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేలా ప్రణాళక ఉండా లని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నెలకు 2సార్లు పాతబస్తీ అభివృద్ధి పనులపై సమీక్షించాలని సూచించారు. రూ.1,600 కోట్లతో చేపట్టే మూసీ నది ప్రక్షాళన, ఆధునీకరణ పనులను, రూ.1,200 కోట్లతో చేపట్టిన మెట్రో రైలు పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పాతబస్తీలో మౌలిక వసతులపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. మంత్రులు కె.తారక రామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవై సీ, సీఎస్ ఎస్.కె.జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, హైద రాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజి బోర్డు ఎండీ దానకిషోర్, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, రాజేశ్వర్ తివాకీ, వాకాటి కరుణ, అరవింద్‌కుమార్, హైదరా బాద్ కలెక్టర్ యోగిత, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్ పాల్గొన్నారు.
సమైక్య పాలనలో నిర్లక్ష్యం...
సమైక్య పాలనలో పాతబస్తీ చాలా నిర్లక్ష్యానికి గురైందని, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పాతబస్తీలో విద్యుత్ కోత, మంచినీటి ఎద్దడి, రోడ్లు సరిగా లేవని, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని తాను 30 ఏళ్ల నుంచి వింటున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగడానికి వీల్లేదని, సమగ్ర ప్రణాళికతో పనులు చేపట్టాలని ఆదేశించారు.

Leave a Comment